26.3 C
Hyderabad
Monday, August 3, 2026

హృద్రోగ బాధితురాలికి ఎల్ఓసీ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన గజ్జెల విజయలక్ష్మి అనే మహిళ కుటుంబ సభ్యునికి శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్ ఓ సీ ని అందజేశారు. హృద్రోగ సమస్య తో బాధపడుతున్న విజయలక్ష్మి అనే బాధితురాలికి చికిత్స నిమిత్తం రూ 2 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలపగా  ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దాంతో స్పందించిన ఎమ్మెల్యే రూ. 2 లక్షల ఎల్ ఓ సీ ని బాధితుల మహిళ కుటుంబ సభ్యునికి అందజేశారు. దాంతో భాధితురాలికి నిమ్స్ హాస్పిటల్ లో చేర్పించి వైద్యం ను చేయిస్తున్నారు. పేదవారైన భాదిత కుటుంబానికి చికిత్స కొరకు  రూ.2,00,000  ఎల్ ఓ సీ మంజూరు చేయించి ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article