27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రుద్రూర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి, పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడలిల వద్ద బతుకమ్మలను ఒకే చోట పెట్టి బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ, చిన్నారులు కోలాటాలతో నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ శివారులోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article