బతుకమ్మ, బిచ్కుంద : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడుతరాల ఉద్యమశీలని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని, ఆయన చూపించిన మార్గం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని బాన్సువాడ డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ రాజు అన్నారు. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ…బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ చేసిన ఎనలేని సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, సాయుధ పోరాటం నుంచి రాజకీయ పోరాటం వరకు తన త్యాగస్ఫూర్తిని చాటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చూపిన పట్టుదల, విశ్వాసం, తపన తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధనే లక్ష్యంగా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. ఆయన చూపిన మార్గం, విలువలు అందరికీ స్పూర్తిదాయకం కావాలని కోరారు. ఆయన ఆశయాల కోసం, సమాజ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని డాక్టర్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం కులస్తులు మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

