28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. ఇందూర్ డిచ్పల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రం లోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎఫ్ఈఓ లో 750 మంది రైతులు ఒక్కతాటిగా ఉండి మీరు చేసే ప్రతి పనికి ప్రభుత్వం నుండి ఏమైనా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. మార్కెట్ కమిటీలు ఇంతకుముందున్న ప్రభుత్వంలో సంచికి నాలుగు రూపాయలు తీసుకునేవారని, తాము వచ్చినప్పటి నుంచి దాన్ని తీసేశామని తెలిపారు. రైతులు కలిసికట్టుగా ఉండి వారు పండించే ధాన్యాన్ని మా మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. రైతులను ఆదుకొనుటలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు.

We will always be available to farmers.

ఆకుల పాపయ్య మాట్లాడుతూ రైతులంత ఐక్యమై ఆందోళనలు చేసిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు దేశవ్యాప్తంగా 10 వేల సంఘాలను ఏర్పాటు  చేసింది అని అన్నారు. రైతులందరు కలిసి ఒక్క సంఘంగా ఏర్పడి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎఫ్ పీ ఓ ద్వారా ఇస్తామన్నారు. ఎఫ్ పీ ఓ చైర్మన్ అగ్గు చిన్నయ్య మాట్లాడుతూ భవిష్యత్తు లో ఎఫ్ పీ ఓ అభివృద్ధికి కొరకు కృషి చేస్తామని అన్నారు. భవిష్యత్తు లో బెల్లం తయారీ కేంద్రం ఏర్పాటు చేయాడానికి తగిన కృషి చేస్తున్నామని దాని కొరకు  రైతులు  చెరుకు పండించేందుకు ముందుకు రావాలని కోరారు.  ఈ కార్యక్రమం లో డైరెక్టర్లు వేల్పూర్ భూమయ్య, కొట్టె గంగాధర్, మామయి రాజన్న, దేవాసామి, పెంటజీ, కృష్ణాగౌడ్, పద్మ, రజిత, సూర్య రెడ్డి, డి.సాయరెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

We will always be available to farmers.

More articles

Latest article