నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. బుధవారం నిజామాబాద్ రెవెన్యూ భవన్ లో ఈ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర సంఘం నుండి ఎన్నికల అధికారులుగా హాజరైన నారాయణ రెడ్డి, నిరంజన్ రావు ల సమక్షంలో జిల్లా శాఖకు ఎన్నికలు నిర్వహించగా, జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కలెక్టర్ కార్యాలయం డివిజన్ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు, తహసిల్దార్లు పాల్గొని జిల్లా సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అన్ని స్థానాలకు ఒక్కోటి చొప్పున మాత్రమే నామినేషన్లు రావడంతో కార్యవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
- జిల్లా శాఖ నూతన కార్యవర్గం ..
అధ్యక్షులుగా ఎల్. రమణ్ కుమార్ (ఆర్‌డిఓ కార్యాలయం, నిజామాబాద్), అసోసియేట్ అధ్యక్షులుగా పి.శ్రీనివాస్ రావు (సూపరింటెండెంట్, కలెక్టర్ కార్యాలయం), ఉపాధ్యక్షులుగా : బి.ప్రభు — ఏ ఆర్ ఐ (తహసీల్దార్ కార్యాలయం, డిచ్‌పల్లి), ఉపాధ్యక్షుడు-II : వై.వి. శశిభూషణ్ ( తహసీల్దార్, సాలూర), ఉపాధ్యక్షురాలు-3 : ఎం. శైలజ (నాయబ్ తహసీల్దార్, ఇందల్వాయి), ఉపాధ్యక్షుడు : పి. వినయ్ సాగర్ ( నాయబ్ తహసీల్దార్, నిజామాబాద్ రూరల్), ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కుమార్ ( అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్ కార్యాలయం, నిజామాబాద్l) ఆర్గనైజింగ్ కార్యదర్శి- డి.వసంత్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి : బి. భరద్వాజ్, సంయుక్త కార్యదర్శులుగా బి.రాజశేఖర్, ఎస్.సవిత, సంయుక్త కార్యదర్శి- రాము, సంయుక్త కార్యదర్శి డి.శ్రవణ్ కుమార్,సంయుక్త కార్యదర్శి కె.గంగరాజం,క్రీడా అండ్ సాంస్కృతిక కార్యదర్శి (ఎన్.విజయరామ రాజు, కోశాధికారి బి.విజయకాంత్ రావు. ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం 2025–2028 కాల పరిమితి కోసం ఎన్నుకోబడినదని తెలిపారు. కాగా, జిల్లాలో రెవెన్యూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కమిటీ తెలిపింది. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రకటించింది.

