రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. బుధవారం నిజామాబాద్ రెవెన్యూ భవన్ లో ఈ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర సంఘం నుండి ఎన్నికల అధికారులుగా హాజరైన నారాయణ రెడ్డి, నిరంజన్ రావు ల సమక్షంలో జిల్లా శాఖకు ఎన్నికలు నిర్వహించగా, జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కలెక్టర్ కార్యాలయం డివిజన్ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు, తహసిల్దార్లు పాల్గొని జిల్లా సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా...