నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 25,26 తేదీలలో సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం కోరారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్ ఆవిష్కరించారు. పీవైఎల్ జిల్లా అధ్యక్షడు వనమాల సత్యం మాట్లాడుతూ దేశం లో రోజు రోజుకు నిరుద్యోగ సమస్య లు పెరుగుతున్న ప్రభుత్వం పట్టించుకువడం లేదని, నిరుద్యోగ యువత కు ఉద్యోగ అవకాశం కల్పించడం లో ప్రభుత్వం విఫలం అయింది అని అన్నారు. కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగసంస్థ లని ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్ లేకుండా చేస్తుందని, ఒక సంవత్సరo లోనే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఎందుకు ఇవ్వలేదో యువత కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలుగా జీఎస్టీ పేరుతో ప్రజల సంపద ను పన్నుల పేరుతో దోచుకొని నేడు జీఎస్ఠీ తగ్గించి సంబరాలు చేస్తున్నాడని అన్నారు. దేశంలో ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయని, ధనవంతుల ఆదాయలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, అదే సమయం లో పేదవాడి ఆదాయం ఎందుకు పెరగలేదో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. దేశం లో మైనారిటీ, దళిత, గిరిజన ప్రజలపైన దాడులు జరుగుతున్నాయని, మణిపూర్ లో మానవ హననం జరిగిన మోడీ ఎందుకు మౌనం ఎందుకు వహించాడో దేశా ప్రజలు అర్ధం చేసుకోవలని అన్నారు. రాష్ట్రo లో విచ్చల విడిగా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్ధాలకి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహారిస్తుందని, డ్రగ్స్ ని నివారించాలని ప్రభుత్వం ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం పివైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండమీది నరసయ్య, పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు వాసరి సాయినాథ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
