28.8 C
Hyderabad
Monday, August 3, 2026

చక్రేశ్వర శివాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బోధన్‌లోని చక్రేశ్వర శివాలయంలో సోమవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సార్వజనిక దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరించి ప్రతిష్టించారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ వేదమంత్రోచ్ఛారణలతో గౌరీ గణపతి, నవగ్రహ, దుర్గాదేవి శతనామావళి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సార్వజనిక ఉత్సవ దేవి కమిటీ అధ్యక్షులు నంద్యాల శ్యామ్, ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, కోశాధికారి ఉద్మీర్ సందీప్, ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకట్ నారాయణ, గ్రామ పెద్దలు, వీడీసీ చైర్మన్, ఆలయాల చైర్మన్లు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Installation of the Goddess idol at the Chakraswara Shiva Temple

More articles

Latest article