25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బంగారు వ్యాపారుల దుకాణాలపై ఐటీ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

  • ముగ్గురు జీరో వ్యాపారుల షాపులలో తనిఖీలు..?

 

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇన్కమ్ టాక్స్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు బంగారు వ్యాపారుల దుకాణాలపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల హైదరాబాదులో క్యాప్సూల్ గోల్డ్ అనే దందా నిర్వాహకులపై ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. వారి వద్ద పన్నులు చెల్లించని (జీరో మాల్ ) బంగారం కొనుగోలు చేసి జిల్లాలో విక్రయిస్తున్న రన్న సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్టు తెలిసింది.. ప్రభుత్వానికి పన్ను ఎగవేత ద్వారా 10 గ్రాముల బంగారానికి సుమారు 9వేల నష్టం సంభవిస్తుంది. జీఎస్టీ తో పాటు సేల్ టాక్స్ లేకుండా జీరోలొ బంగారం కొనుగోలు చేసి విక్రయాలు చేసే దందా చాలా రోజుల నుంచి జరుగుతుంది. తక్కువ ధరకు బంగారు విక్రయం పేరిట మార్కెట్ రేటు కంటే మూడు నుంచి నాలుగు వేలకు తక్కువకు అమ్ముతూ సొమ్ము చేసుకునే దందాను కొందరు వ్యాపారులు నిర్వహిస్తున్నారు. వారి జీరో వ్యాపారం పేరిట బంగారం ఆర్డర్ల ప్రకారం తీసుకొని జీరోలో సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు అందుకే ఈ దాడులు జరిగినట్టు తెలిసింది జిల్లా కేంద్రంలో జీరో దందా నిర్వహించే వ్యాపారుల దుకాణాలపై దాడులు  బంగారు వర్తకుల్లో కలకలం రేపింది.

More articles

Latest article