కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా ట్రాన్స్ జెండార్ల కు టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చీరెలు అందించారు. కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 20మంది ట్రాన్స్ జెండర్లకు పండగ సందర్బంగా చీరెలను అందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పంపరి లతా శ్రీనివాస్, జూలూరి సుధాకర్,చాట్ల వంశీ,తాటి లావణ్య ప్రసాద్,మామిడ్ల రమేష్,రంగా రమేష్ గౌడ్,బల్ల శ్రీనివాస్,కిరణ్, నిరంజన్,యూత్ సభ్యులు మహేష్,తదితరులు పాల్గొన్నారు.

