29 C
Hyderabad
Monday, August 3, 2026

సోయం బాపూరావు, తెల్లం వెంకట్ రావులకు సోయి లేదు

Must read

📰 Generate e-Paper Clip

  • బంజారాల జోలికి వస్తే మీ బ్రతుకు బజారె
  • రెండు లక్షల జానభోడివి, 31 లక్ష జనాభాతో పెట్టుకుంటావా
  • ఖాభార్ధార్ మాజోలికొస్తే మీ పని పడతాం

 

భీమ్ గల్, బతుకమ్మ : గొండ జాతికి చెందిన బీజేపీ మాజీ ఎంపీ సోయం బాబురావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావులు బంజారా(లంబాడా)లను ఎస్టీ రిజర్వేషన్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం వారి సోయిలేని తనముకు నిదర్శనమని   ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల్ ప్రెసిడెంట్ బాధవత్ శర్మ నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల బంజారా భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.మా లంబాడిల (బంజారుల ) జనాభా దామాషా ప్రకారం 1976 లోనే రీజర్వేషన్ ఏర్పాటు చేసారని,అట్టి  రీజర్వేషన్ ను 2022 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్టి సీ యం కే సీ ఆర్  10 శాతం  రీజర్వేషన్ కల్పించారన్నారు. మా బంజారుల ఎదుదల ఓర్వలేకనే మమ్మల్ని ఎస్టీ జాబీత నుండి  తోలగించాలని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, పిటీషన్ దాఖలు చేసే అర్హత మీకు అసలే లేదని ,మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం, మీ  రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే లంబాడి గిరిజనుల ఎస్టీ రీజర్వేషన్ జాబీత నుండి తోలగించాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని,మీరు దేశ, రాష్ట్ర చట్ట సభలో ఉండీ కూడా ఇంత దిగజారుడు మాటలా అని ఆయన దుయ్య బట్టారు. తెలంగాణ రాష్ట్రం లో మా జనాభా శాతం ఎంత 31 లక్షలు, మీ గోండు తెగకు చెందిన జనాభా శాతం ఎంత  కేవలం 2 లక్షలు మాత్రమేనని మరి మీకు సోయీ లేకుండా , తేలుసుకోకుండా మాట్లడితే బంజారా సమాజం ఊరుకోదని, తగిన సమయం లో మీకు తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.మా బంజారుల మనోభావాలనుదేబ్బదీస్తున్న ఈ సందర్భం లో మా సహనాన్ని మా ఓపికను పరిక్షీంచడం మంచి పద్దతి కాదని,రానున్న రోజుల్లో మీకు మంచి గుణపాఠం చేబుదామని, మా బంజారాల జోలికి వస్తే మీ ఇద్దరి బ్రతుకు బజారు పాలు చేస్తామని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఇప్పటికైన మా బంజారుల జోలికి వస్తే, మా రీజర్వేషన్ గురించి మాట్లాడితే నాలుక చీరేస్తామని,ఖబార్ధార్ భారీ అమూల్యం చేల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికీ  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేండు సంవత్సరాలు కావస్తోన్న ఒక్క గిరిజన ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో స్థానం లేదని మీకు చిత్త శుద్ధి ఉంటే దీని గురించి మాట్లాడే సోయిలేదన్నారు. అన్న దమ్ములు వలే ఉన్న వారిని ఎస్టీ జాబీత నుండి తోలగించాలని కోరుతూ మా జాతిని భంగం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు మాజీ ఎంపీపీ రామావత్ తుక్కాజీ నాయక్ , మాజీ కౌన్సిలర్ ధరావత్ లింగయ్య నాయక్, మాజీ సర్పంచ్లు భూక్యా సంతోష్ నాయక్,బాదవత్ తిరుపతి నాయక్ ,మాజీ ఎంపీటీసీ భూక్యా రాజు నాయక్, బంజారా సేవా సంఘ్ మండల ఉపాధ్యక్షులు భూక్యా బాబులాల్ నాయక్, బంజారా సీనీయర్ నాయకులు భూక్యా బుచ్చయ్య, నాయక్,మాలవత్ మంగ్యానాయక్, బానావత్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article