నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గురువారం గుర్తు తెలియని అమ్మాయి మృతదేహం లభ్యమైంది. 14నుండి18సంవత్సరాల వయస్సు గల అమ్మాయి మృతదేహం లభ్యమైనట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. అమ్మాయి ఒంటిపై మెరూన్ రంగు లెగిన్, ఆకుపచ్చ రంగు గల టాప్, బూడిద రంగు స్కార్పు, కాళ్లకు పట్టీలు, కుడి కాలుకు దారం ఉన్నట్లు తెలిపారు. ఈ గుర్తు తెలియని అమ్మాయి మృతదేహాన్ని ఎవరైనా గుర్తించితే నిజాంసాగర్ ఎస్ఐ 8712686172 పోన్ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు. మృతి చెందిన అమ్మాయి నిజాంసాగర్ మండలానికి చెందిన వారా లేక ఇతర ప్రాంతానికి చెందిన వారా.. అనే విషయం బహిర్గతం అయితేనే అమ్మాయి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అమ్మాయిని ఎవరైనా హత్య చేశారా లేక ఇంకా ఎమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.


