వెబ్ న్యూస్,బతుకమ్మ : ఏపీలోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు. సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో టిప్పర్ వేగంగా వచ్చి కారు ఢీకొట్టి కొద్దిదూరం వరకు లాక్కెళ్లింది. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో అందులోని మృతదేహాలు నుజ్జునుజ్జుయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
