ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్షి అజిత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో గల ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్షి అజిత్ రెడ్డి ని 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి నాయకులు ఆయన చాంబర్ లో కలిసి, కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా ఇటీవల రాష్ట్ర హై కోర్టు 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి అని, దీనిని 3 నెలలో అమలు చేయాలని స్పష్టం గా తీర్పు ఇచ్చింది తీర్పును వెంటనే అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. దీనికి అజిత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పాత పెన్షన్ అమలు అయ్యేలా చూస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్షి ఇమ్మడి సంతోష్ కుమార్, రాష్ట్ర కోశాధికారి గుంటి వేణుగోపాల్, రాష్ట్ర నాయకులు కనకపురం రవింధర్, సురేందర్, వై రవింధర్ తదితరులు పాల్గొన్నారు.
