29 C
Hyderabad
Monday, August 3, 2026

లెక్క తెలియక తిక్క సమాధానాలు చెబితే ఊరుకోనేదిలేదు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎక్కవ వచ్చిన యూరియా ఎక్కడ పోయింది
  • ముందస్తు లెక్కలు, పక్క ప్రణాళిక లేక సిగ్గులేని మాటలు
  • అక్రమ కేసులున్ని చేసిన ప్రశ్నిస్తూనే ఉంటాం
  • ప్రతిపక్షమైన బీయర్ ఎస్ పక్క ప్రజల పక్షామే
  • బీయర్ ఎస్ మండల నాయకులు రేగుంట దేవేందర్, నగదర్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ : గత బీయర్ ఎస్ ప్రభుత్వం సరఫరా చేసిన దానికంటే ఇప్పటి వరకు ఎక్కువే యూరియా కాంగ్రెస్ ప్రభుత్వం సరఫరా చేసిందని, అయిన ప్రభుత్వాన్ని ప్రశాంత్ రెడ్డి బదునామ్ చేస్తున్నాడని సునీల్ కుమార్, మానాల మోహన్ రెడ్డి లు చేస్తున్న ఆరోపణలు లెక్క తెలియని తిక్క సమాధానాలని, అలాంటి సమాధానాలు, తలతిక్క మాటలు మాట్లాడితే ఊరుకోనేది లేదని బీయర్ ఎస్ నాయకులు వేల్పూర్, కమ్మర్ పల్లి మండల బీయర్ ఎస్ ప్రెసిడెంట్లు నగదర్ రెడ్డి, రేగుంట దేవేందర్ లు అన్నారు. యూరియా కోసం కానిస్టెన్సీలో రైతులు పడుతున్న యూరియా కష్టాలను గురించి మాజీ మంత్రి మాట్లాడితే దానికి సరియైన సమాధానం చెప్పకుండా మానాల, సునీల్ చేసిన తలతిక్క వ్యాఖ్యలను వారు సోమవారం మండల కేంద్రంలో ని పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ నిర్వహించి ఖండించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు సునీల్ కుమార్ చెప్పినట్లుగా గతంలో కంటే ఇప్పటికి ఎక్కవ యూరియా మన కానిస్టెన్సకి వస్తే మరి ఎక్కడిపోయిందో వారే సమాధానం చెప్పాలన్నారు. ఎక్కవ యూరియా వస్తే ఒక్క బస్తా యూరియా కోసం రైతు రోడ్డు ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. గత బీయర్ ఎస్ ప్రభుత్వంలో రాని ఈ యూరియా సమస్య ఎందుకు జఠి లమైందో ముందు మీరు గుర్తేరిగి మాట్లాడాలన్నారు. యూరియా ఎంత అవసరమో ముందస్తు లెక్కలు,ప్రణాళిక లేకే బాల్కొండ కానిస్టెన్సీలో ఈ పరిస్థితి దాపూరించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టెన్సీలో అందరూ లీడర్లే కానీ రైతుకు యూరియా సరఫరా చేయలేక విఫలమయ్యారని వారు దుయ్య బట్టరు. ముందు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుందని కానిస్టెన్సీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రైతుల పక్షనా మాట్లాడితే తప్పు ఒప్పుకోకపోగా ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

నిజంగా యూరియా కొరత లేకుంటే రైతులందరూ  ఒక్క సంచి యూరియా కోసం రోడ్లమీద ఎందుకు నిలబడుతున్నారో కానిస్టెన్సీ కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగానే మా కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సప్లై చేసిందని సునీల్ రెడ్డి అంటున్నారె, అయ్యా సునీల్ రెడ్డి గారు మీరు గత  ప్రభుత్వం కంటే యూరియా ఎక్కువ సప్లై చేసినట్లయితే రైతులందరూ ఇంత అవస్థలు ఎందుకు పడుతున్నారో, నిద్రాహారాలు మాని తెల్లందాక, రాత్రింబవళ్ళు ఒక్క బస్తా యూరియా కోసం  చెప్పులు లైన్లో పెట్టి పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. గత మా కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి చెప్తే ఆటో లో వచ్చి యూరియా సంచులు ఎన్ని కావాలంటే అన్ని వేసి వెళ్లేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా చెప్పండని వారు అడిగారు.  మీకు పరిపాలన చేతకాక, ముందస్తు ప్రణాళిక లేక రైతులను ఇబ్బంది పెడుతున్నారని,  ఇలాగే ఇంకో వారం రోజులు పరిస్థితి ఉంటే పంట మొత్తం నష్టపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని అన్నారు.

యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం  విఫలమై సమాధానం చెప్పుకోలేక కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టుతున్నారని వరన్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే మా బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ మనమందరం వెళ్లి యూరియా కోసం ఢిల్లీలో ధర్నా చేద్దామని చెప్పే అడిగారు కానీ మీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ దానిమీద మాట్లాడలేదు ఎందుకని అని ప్రశ్నించారు. మోడీ ముందట ధర్నా చేయడానికి భయపడుతున్నారా, అసలు ఒక్కొక్క సొసైటీ కి ఎంత యూరియా అవసరం ఉంది,  ఎంత సరఫరా చేసారో,  క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏంటో  అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందా అని వారు ప్రశ్నించారు. దేశానికి రైతే వెన్నెముక అలాంటి రైతు ఒక్క యూరియా బస్తా కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మూడు చెర్ల నీళ్లు త్రాగే పరిస్థితి తెచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజల పక్షాన, రైతుల పక్షాన,  మహిళల పక్షాన వారి యొక్క సమస్యలను ప్రభుత్వం కు తెలియజేయడానికి ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటే, మాట్లాడితే మేము మీ మీద ఇంకా స్పీడ్ గా  ముందుకి వెళ్లొల్సి  వస్తుందని మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని, మా మీద మీరు అక్రమ కేసులు పెట్టడానికో, మా ఇంటి మీద దాడి చేయడానీకో  స్పీడ్ గా ముందుకు వెళ్ళడం కాదు మోహన్ రెడ్డి, రైతులకు యూరియా సక్రమంగా సరఫరా చేయడానికి స్పీడ్ గా ముందుకు వెళ్ళండి,  దాంట్లో మీ పనితనం నిరూపించుకోండి,  కానీ ప్రశ్నించిన వారిని బెదిరిస్తామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరని వారు మానాలకు స్పష్టం చేశారు. మీ ప్రభుత్వం రైతులకు, మహిళలకు,ఉద్యోగులకు  ఇచ్చిన ఏ ఒక్క ఆమె సక్రంగా అమలు చేయక పూర్తిగా విఫలమైందని, ప్రజలందరు అన్ని గమనిస్తున్నారని,  గత పరిపాలన ఎలా ఉండే ప్రస్తుతం మీ పరిపాలన ఎలా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని,  రేవంత్ రెడ్డిని బండకేసుకొనడానికి ప్రజలందరూ మూకుమ్మడిగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎద్దు ఏడ్చినా ఎవసం,  రైతు ఏడ్చినా రాజ్యం ఎప్పుడు బాగుపడదలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే యూరియా బుక్కిచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.ఈ ప్రెస్ మీట్ లో బీయర్ ఎస్ కానిస్టెన్సీ, మండల నాయకులు మిట్టపల్లి మహిపాల్, సామ వెంకట్ రెడ్డి, ఏలీయా, పూర్ణా నందం, సొసైటీ చైర్మన్ లు మోతె రాజేశ్వర్ రెడ్డి, పచ్చల నడుకూడా లింబారెడ్డి,భీమ్ గల్ మాజీ జడ్పి టీ సీ చౌట్ పల్లి రవి,మాజీ ఎం పీ పీ ఉపేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీ సీ డోళ్ళ రాజేశ్వర్ రెడ్డి, బాబూర్ ప్రతాప్ రెడ్డి, ఉప్పులూర్ చిన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article