బతుకమ్మ, ఏర్గట్ల : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్గట్ల మండలంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన అవార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు ప్రతీ సంవత్సరం లాగే విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్న వారి సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎంఈఓ అనంద్ రావు మాట్లాడుతూ,ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఉపాధ్యాయ వృత్తికి మరింత గౌరవం తెచ్చి పెడుతుందని అన్నారు. ఉపాధ్యాయులకు మరింత బాధ్యత పెంచుతుందని అలాగే మిగతా ఉపాధ్యాయులకు స్ఫూర్తి నింపుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన,పి ఆర్ టి యు, యుటిఎఫ్,టి పి యు ఎస్, సంఘాల ఉపాధ్యాయ నాయకులు మండల పిఆర్టియు అధ్యక్షులు కృష్ణ ప్రసాద్,సత్యానంద్, కిషన్ రెడ్డి,విజయ్,రాజశేఖర్ లకు అభినందనలు తెలియజేశారు.
