25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లాకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఙివియం రాష్ట్ర కార్యదర్శి విఠల్

 

కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ 8 వేల కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి విఠల్ డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలు నుండి ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఉన్నత చదువులు చదవడానికి ప్రభుత్వ , ప్రవేట్ కళాశాలలో రియంబర్స్మెంట్ రాకపోవడంతో డబ్బులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని కళాశాల అధికారులు, యజమాన్యాలు అంటున్నారని తెలిపారు. ప్రవేట్ కళాశాల కూడా మూతపడే అవకాశం ఏర్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయకపోతే భారతీయ విద్యార్థి మోర్చ, ఇతర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

More articles

Latest article