బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. 1969 లోను, 2009-2012 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాలలో ఆయన పాల్గొనడం జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళి పేర్కొన్నారు. నగరంలోని వినాయక్ నగర్ అమరవీరుల పార్క్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నిజాం రాజును అంతమొందిచడం కోసం బాంబు దాడికి నలుగురు యువకులకు వ్యూహం రచించి, 1947 డిసెంబరు 4న నిజాం కారుపై సుల్తాన్ బజార్‌లో నారాయణరావు పవార్ బాంబు విసిరాడం జరిగిందన్నారు. కొద్ది తేడాతో అది కారు వెనుక భాగాన పేలిందన్నారు. అయన సేవలను ప్రతి తెలుగు వారు గుర్తు ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మెతుకు శివకుమార్, జిల్లా అధికార ప్రతినిధి ఆమంద్ ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు కుర్లెం శివ తదితరులు పాల్గొన్నారు.
