27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 130మందికి జరిమాన

Must read

📰 Generate e-Paper Clip

  • మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదు
  • వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు 14 రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 130 మంది మందు బాబులు పట్టుబడగా వారిని వేములవాడ పోలీసులు శుక్రవారం  కోర్టులో ప్రవేశపెట్టారు. 130 మందిలో 70 మంది ద్విచక వాహనదారులకు ఒక్కొక్కరికి 2000/- రూపాయలు,30 మంది ద్విచక్ర వాహనదారులకు ఒక్కఒక్కరికి 5000/- ,30 మంది టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనదారులకు ఒక్కొక్కరికి 10,000/- రూపాయల జరిమానాలు విధిస్తు వేములవాడ  మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ తెలిపారు.వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లోపట్టుబడిన మందు బాబులకు పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్.ఐ రాజు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేపించారు.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ ప్రతి రోజు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించడం జరిగుతుందని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతు పట్టుబడిన వారికి వారి తల్లితండ్రుల, లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగుతుందని అన్నారు.మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశలకు పోలీస్ వెరైఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలుగుతాయని,ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article