మోర్తాడ్, బతుకమ్మ: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని, రేపటి భావితరాలకు ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండాలని మండల విద్యాశాఖ అధికారి సమ్మిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మోర్తాడ్ మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను గురువారం ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షులు ప్రగతి కుమార్, కార్యదర్శి రాములు, యుటిఎఫ్ అధ్యక్షులు దండు గంగాధర్, కార్యదర్శి బాలరాజు, ఎస్సీ ఎస్టీ యూనియన్ అధ్యక్షులు రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి రవీందర్, త పాస్ అధ్యక్షులు రవి, ఎస్ జి టి యూనియన్ అధ్యక్షులు మధుసూదన్ రావు, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

