బతుకమ్మ, బోధన్: బోధన్ మండలం బెక్నెల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ రాంపూర్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తీసుకు వస్తుండగా కల్దుర్కి – సిద్ధాపూర్ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో విద్యుత్ స్తంభాలు జిపి సిబ్బంది మీదపడగా, వారు అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. మృతులు అధికారిక పనులలో భాగంగా ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. అధికారుల నిర్లక్ష్యమేనా లేదా యంత్రాంగ వైఫల్యమా అన్న దానిపై విచారణ జరగాల్సి ఉంది.

