24 C
Hyderabad
Sunday, August 2, 2026

మేనత్తను గొడ్డలితో నరికి చంపిన మేనల్లుడు

Must read

📰 Generate e-Paper Clip

ములుగు, బతుకమ్మ :  ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పలగూడెం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేనత్త కొండ గర్ల ఎల్లమ్మ(50)ను మేనల్లుడు విజయ్ మద్యం మత్తులో గొడ్డలితో నరికి చంపాడు.  జల్సాలు, మద్యానికి బానిసైన విజయ్ డబ్బులు ఇవ్వాలని మేనత్తను డిమాండ్ చేయగా, ఆమె నిరాకరించింది. దీంతో ఆమె ఆరుబయటకు వెళ్లగా గొడ్డలితో అతి కిరాతకం హతమర్చాడు. నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బంధువుల నుంచి వివరాలు సేకరించారు.

 

More articles

Latest article