30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ మండలం హన్మాజిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్వో విద్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సిబ్బంది విధి నిర్వాహణ, రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, రోగుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వైద్యసేవలు అందించాలని సూచించారు. అలాగే ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆమె వెంట వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

More articles

Latest article