బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా వద్ద జిఎస్టి స్లాబ్ లను తగ్గించినందుకు గాను మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ నిత్యవసర సరుకులను, ఆహార పదార్థాల 18 శాతం నుంచి 12 శాతం రేటు తగ్గించి సాధారణ ప్రజలపై పన్ను భారాన్ని పడకుండా చూశారని ఇన్సూరెన్స్ కి జిఎస్టి ఎత్తివేయడం ద్వారా అందరికీ బీమా సౌకర్యం అందుబాటులో వచ్చేలా చూశారని బిజెపి ప్రభుత్వం జీఎస్టీ భారీగా తగ్గించడం వల్ల దేశ ప్రజలకు ఆర్థిక భారం తగ్గనుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ శ్రీధర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అత్తిలి తిరుమలేష్, పొన్నాల రంజిత్, ఉపాధ్యక్షులు నాగర్ర్తి నరేందర్, బండి రాములు, శంకర్, జయపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజు, ఏక్ నాథ్ , బాల్ లింగం వెంకటరెడ్డి, బిజెపి కార్యకర్తలు ఉన్నారు.
