28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

 

హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారు బీసీ రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ‘‘దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ. ఉచిత బస్సు మొదలుకొని సన్నబియ్యం వరకు చరిత్రాత్మక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి.  రాహుల్ గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కుల సర్వే పారదర్శకంగా నిర్వహించాం. కామారెడ్డి లో లక్ష మందితో  బహిరంగ సభ. ఓట్ చోరీ పై రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారు. పదవే పరమావధిగా భావించే మోదీ, అమిత్ షా ఓట్ చోరీ చేస్తారు. మహారాష్ట్రలో ఎన్నికలో వోట్ చోరీ జరిగింది. అనైతిక చర్యలను రాహుల్ గాంధీ సహించరు. వోట్ చోరీ వల్లే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ..12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా?. ఉద్యోగాల కల్పన దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు పికే పరిస్థితి.  బీజేపీ వాళ్లకు ఎన్నికలు వస్తె దేవుడు గుర్తొస్తారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ దేవుళ్ళ పేరు చెప్పి గెలిచారు. దేవుళ్ళకు , బీజేపీ పార్టీకి ఏం సంబంధం. 2029 లో మోడీకి పరాభవం తప్పదు..రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యం. వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ ఖేల్ ఖతం. కవిత స్టేట్ మెంట్ తో కేసిఆర్ కుటుంబం దోపిడీ బట్ట బయలు అయ్యింది. కేసిఆర్ కుటుంబం దొంగల ముఠా. దొంగల ముఠా అవినీతి బాగోతం బట్ట బయలు అయ్యింది. కార్లలో డీజిల్ పోసుకోలేని కేసిఆర్ కుటుంబం.. అవినీతి సొమ్ముతో వందల కోట్లకు పడగలెత్తింది. సిఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం. ప్రభుత్వానికి – ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్నా. మీనాక్షి గాంధీ నిజాయితీకి నిలువెత్తు రూపం’’ అని అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు, కార్పరేషన్ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article