26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియమితులు అయ్యారు. నిజామాబాద్ నగరానికి చెందిన గోపిడి స్రవంతిరెడ్డి ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. అంతకు ముందు నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. 2019 లో జరిగిన మన్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో కార్పోరేటర్ గా గెలిచిన తరువాత ప్లోర్ లీడర్ గా ప్రజా సమస్యలను లేవనెత్తి అందరి మన్ననలు పొందారు. ఆరు సంవత్సరాల రాజకీయంలో బీజేపీలో అంచలంచెలుగా ఎదిగారు. నన్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి లకు నా హృదయపూర్వక ధన్యవాదములు. నాకు ఈ బాధ్యతలు అప్పగించి నందుకు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు నా శాయశక్తులా మరింత చిత్తశుద్ధితో పని చేస్తానని స్రవంతి రెడ్డి తెలిపారు.

More articles

Latest article