28.8 C
Hyderabad
Monday, August 3, 2026

సీపీకి మిట్టపల్లి మాదిగ కులస్తుల ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్  : డిచ్ పల్లి మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన మాదిగ కులస్తులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు సోమవారం ఆయన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  మిట్టపల్లి గ్రామంలో ఈ నెల 4న నిమజ్జన సమయంలో అగ్రవర్ణ కులాలకు చెందిన మున్నూరు కాపులు మాదిగ కులస్తులపై లడ్డు వేలం పాటలో మీ బతుకులెంత మేము లేకపోతే మీరు ఎక్కడ బతుకుతారు బూతులు మాట్లాడుతూ దుర్భషలాడారని తెలిపారు. సుంకటి పోషన్న, కిరణ్ , సుంకేటి గంగారం, వేల్పూర్ గంగాధర్ , వేల్పూర్ సాయిలు, మైలారం భోజన్న వాళ్లపై దుర్విషలాడుతూ మీది మీదికి  వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. దాడి చేసిన వారు తెలు గణేష్, మాసి పెద్ది శ్రీనివాస్, గోపురాజేశ్వర్, గోపుచరణ్, మాసి పెద్ది రవి, హౌసుల రమేష్ తెలు సుమన్ మున్నూరు కాపు చెందిన వీరిపై నిజాంబాద్ సిపి కార్యాలయంలో అట్రాసిటీ కేసు చేయాలని సిపి ని కోరారు. దీనిపై స్పందించిన సిపి డిచ్పల్లి ఎస్సైకి ఫోన్ చేసి దీనిపై విచారణకు ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు సుధాకర్, మాదిగ కులస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article