- రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
సిరికొండ, బతుకమ్మ : పిల్లలపైన తల్లిదండ్రుల ప్రేమ వేల కట్టలేమని, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ప్రొఫెసర్ లింబాద్రి మాతృమూర్తి లక్ష్మీ సంస్కరణ సభ లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొన్నారు. ప్రొఫెసర్ లింబాద్రి మాతృమూర్తి లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ లింబాద్రి రచించిన అమ్మతో అనుబంధం అనే పుస్తకాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా పిల్లలకి నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజంలో వారు సేవ చేస్తారని అని అన్నారు. కొంతమంది పిల్లలకు డబ్బులు సంపాదిస్తారు కానీ విద్యాబుద్ధులు జ్ఞానాన్ని సంపాదించలేక పోతారని అన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు మంచి జ్ఞానాన్ని అందిస్తే వారు ఉన్నత శిఖరాలు ఎక్కి, ఇతరులకు కూడా సహాయాన్ని చేయడంలో ముందుంటారని అన్నారు. ప్రొఫెసర్ లింబాద్రి మాతృమూర్తి లక్ష్మి చదువుకోకపోయినా నా పిల్లలు విద్యావంతులు కావాలని దురదృష్టి ఆలోచించి వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించి, రాష్ట్ర విద్యా మండలి చైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రిని చూడడంలో ఆమెకు ఎంతో సంతోషంగా ఉండేదని అన్నారు. వారి కుటుంబంలో ఉన్న అందరికీ ఉన్నత చదువులు చదివిపించి, రావుట గ్రామానికి జిల్లాకు రాష్ట్రానికి పేరు తెచ్చిందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకి విద్య అందించడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. సమాజంలో పిల్లలు చెడు అలవాట్లకు పడకుండా చూడాలని అన్నారు. గ్రామంలో చాలా మందిని పెద్దమనుషులను చూస్తామని వారి నుండి మనము ఎంతో నేర్చుకోవాలని అన్నారు, వారు అనుభవించిన అనుభవాలతో మనకు నేర్పి మన పిల్లలను కూడా అలాగే చేయాలని వారు చెప్తా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ లింబాద్రి,డాక్టర్ సుదర్శన్, ఏ ఎం సీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ మునిపల్లి సాయ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజవర్గ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, ప్రొఫెసర్ లింబాద్రి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

