బతుకమ్మ, ఏర్గట్ల : ఎంపీటీసీ, జడ్పిటిసి, ఓటర్ల జాబితా మరియు ఏర్గట్ల మండల పరిధిలోని గ్రామ పోలింగ్ స్టేషన్ల వివరములు శనివారం రోజు మండల పరిషత్ కార్యాలయంలో, మండల పరిధిలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల కు పంచాయితీ కార్యదర్శుల ద్వారా అందజేయడం జరిగిందని మండల ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు.అలాగే మండల పరిధిలోని గ్రామాల్లోని ఎంపీటీసీ, జడ్పిటిసి,ఓటర్ల జాబితాలో గానీ లేదా పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 8,9,2025. తేదీ సాయంత్రం 5 గంటల లోపల మండల పరిషత్ కార్యాలయం ఏర్గట్ల లో తెలుపగలరని ఎంపీడీవో వెంకటేశ్వర్లు అన్నారు.9 తేదీ తర్వాత ఎంపీటీసీ, జడ్పిటిసి, ఓటర్ లిస్టులూ పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా ఫైనల్ చేయబడతాయి, ఇట్టి విషయాన్ని మండల పరిధిలో నీ గ్రామాప్రజ లు గమనించగలరని అన్నారు.
