24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బోధన్‌లో గురుకుల విద్యార్థిని కిడ్నాప్ కలకలం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మంద ప్రణీత  ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో8వ తరగతి చదువుతోంది. తన తండ్రి నాగరాజుతో కలిసి గురువారం సాయంత్రం ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం ప్రకారం, సాయంత్రం ఐదు గంటల సమయంలో బోధన్ ఆచన్‌పల్లి వద్ద ఉన్న దీపక్ స్వీట్ హోమ్ వద్ద ప్రణీత కనిపించకుండా పోయింది. ఒక లేడీ కిడ్నాపర్ ప్రణీతను బోధన్ అంబేద్కర్ చౌరస్తా నుండి బాన్స్‌ వాడ బస్సులో ఎక్కించి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై బోధన్ పోలీసులు అప్రమత్తమై, కిడ్నాపర్ కదలికలను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విశ్లేషిస్తున్నారు. విద్యార్థిని కిడ్నాప్ వార్తతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

More articles

Latest article