27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం మునిపెల్లి గ్రామంలోని దళితుల భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న 12 మంది పైన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన సుమారుగా 50 మంది దళితులు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కు వచ్చి శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు రావట్ల లచ్చన్న మాట్లాడుతూ మాదిగ కులానికి చెందిన నాకు ఒక ఎకరం భూమి ఉన్నదని, కానీ ఆ భూమిని గ్రామానికి చెందిన కొందరుకబ్జా చేస్తూ అందులో శివలింగం ప్రతిష్టాపన చేసుకున్నారని, ఇదేమిటి అని అడిగిన మమ్మల్ని దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నరన్నారు . ఈ విషయమై జక్రన్ పల్లి మండల పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఒ కు ఫిర్యాదు చేయగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసఈ విలేకరుల సమావేశంలో జెల్ల మజ్ను, గుమ్మేర్ల గంగారం, గుమ్మర్ల నరసయ్య, సాగర్, గోపి, భూమేష్, రాహుల్, అభి, గైని రమేష్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article