భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం మునిపెల్లి గ్రామంలోని దళితుల భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న 12 మంది పైన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన సుమారుగా 50 మంది దళితులు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కు వచ్చి శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు రావట్ల లచ్చన్న మాట్లాడుతూ మాదిగ కులానికి చెందిన నాకు ఒక ఎకరం భూమి ఉన్నదని, కానీ ఆ భూమిని గ్రామానికి చెందిన కొందరుకబ్జా...