24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళపై అత్యాచారం చేసిన ఒకరికి పదేళ్ల కఠిన కారాగారశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ మహిళా ప్రత్యేక కోర్టు జడ్జి హరీష తీర్పు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒక మహిళను అపహరించి, అత్యాచారం చేసి, గర్భవతిని చేసి, బెదిరించిన నేరాలలో జైలుశిక్షలను విదిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రత్రేక మహిళ కోర్టు జడ్జి హరీష మంగళవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. ఎర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన జంగం రాజశేఖర్ అదే గ్రామ నివాసురాలు మహిర్భూమికి వెల్లి వచ్చేటప్పుడు కాపుకాసి ఆమెను అపహరించి ఒక కొట్టంలో పదేపదే అత్యాచారం చేశాడు. కొన్నాళ్లకు ఆమె గర్భిణీ అయింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కారకుకులు ఎవరు ఏమిటి అనేది ఘర్షణకు దారితీసింది. సదరు మహిళ ఈ విషయం ఒకానొక సందర్భంలో రాజశేఖర్ ను నీలదీయడంతో అతను ఆమెను బెదిరించి నిజామాబాద్ లోని తేజ హాస్పిటల్ లో చేర్పించి బలవంతంగా అబార్షన్ చేయించాడు. పోలీసులు కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం ఆధారంగా నేర న్యాయ విచారణలో భాగంగా మొత్తం పది మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, పద్నాల్గు ధ్రువీకరించుకున్న పత్రాలు మార్క్ చేసుకుని, అన్నిటిని అధ్యాయనం చేసిన అదనపు సెషన్స్ జడ్జి హరీష ముద్దాయిపై నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారించారు. భారత శిక్షస్కృతి సెక్షన్ 366 (అపహరించడం) ప్రకారం ఏడు సంవత్సరాల జైలుశిక్ష ఐదు వేల రూపాయల జరిమానా, సెక్షన్ 376(2)(ఎన్) ఒక మహిళపై పదే పదే అత్యాచారం చేయడంకుగాను పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పదివేల రూపాయల జరిమానా,సెక్షన్ 417 మోసం చేసినందుకు గాను ఒక సంవత్సరం జైలుశిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా, బెదిరింపులు చేసినందుకు రెండు సంవత్సరాల జైలుశిక్ష ఐదు వేల రూపాయల. జరిమానా విధించారు.

  • బాధితురాలికి ఐదు లక్షల పరిహారంకై సిపార్సు..

ముద్దాయి రాజశేఖర్ క్రూరత్వం మూలంగా బాధిత మహిళ శరీరక, మానసిక భాధలకు, వేదనలకు గురైనందున జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఐదు లక్షల రూపాయల ఆర్థిక పరిహారం అందజేయాలని జడ్జి హరీష తమ తీర్పులో సిపార్సు చేశారు.

More articles

Latest article