28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వైఎస్సార్ కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఉమ్మడి ఏపీ దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అధ్యక్షతన ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల చేసి  కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని,  ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్రప్రసాద్, జండా గుడి చైర్మన్ ప్రమోద్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, బంటు బలరాం, కొండపాక రాజేష్,  రమేష్, పుప్పాల విజయ, ముసు పటేల్, బింగి శుభం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article