- పంట నష్టం పెంచే విషయంలో సీయం రేవంత్ ను కలుస్తా
- రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తే కేంద్రం ద్వారా సహాయం అందిస్తాం
- నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్

నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. పంట ఆస్తి నష్టం పై నివేదికలు పంపిస్తే కేంద్రం ద్వారా సహకారం అందిస్తామని ,నష్ట పరిహారం పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో పర్యటించిన అరవింద్ ఇటీవల వరదలతో దెబ్బ తిన్న ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను ఓదార్చారు. ఈసందర్బంగా అరవింద్ మాట్లాడుతు… నష్టాన్ని తక్కువ చేసి నివేదికలు తయారు చేస్తున్నారని మండిపడ్డారు. పంటలు నష్టపోయిన రైతులకు ఏకరానికి 50 వేలు తక్షణ సహాయం

అందించాలని డిమాండ్ చేశారు. నష్టాన్ని అంచనా వేయకుండా సహాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. వరద నష్టం పై సీఎం రేవంత్ ను కలుస్తానని అరవింద్ అన్నారు. వరదలతో జిల్లా వ్యాప్తంగా పంట నష్టం ఆస్తి నష్టం జరిగిందన్నారు. 25 వేల మంది రైతులకు సంబంధించి 49 వేల ఎకరాలు పంట మునిగిపోయిందన్నారు. 1100 ఎకరాలలో ఇసుక మేటలు వేసిందన్నారు. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగాని కిచిత్తశుద్ధి లేదని అందుకే నష్టాన్ని తక్కువ చేసి నివేదికలు తయారు చేస్తున్నారు అని ఆరోపించారు. ఇసుక మేటలు ప్రభుత్వమే తొలగించాలని, ఆస్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయక పోవడం సిగ్గు చేటు అన్నారు. వరద నష్టం పై సీఎం రేవంత్ ను కలుస్తానని , రాష్ట్ర ప్రభుత్వం నివేదిక లు ఇస్తే కేంద్రం ద్వారా సహాయం అందిస్తాం అన్నారు. ఎంపి అర్వింద్ వెంట జిల్లా అధ్యక్షులు కులచారీ దినేష్, ఎలేటి మల్లిఖార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు.

