బతుకమ్మ, ఏర్గట్ల ; మండల కేంద్రములో రేషన్ షాపుల వద్ద కొత్తగా 350 రేషన్ కార్డుల మంజూరు, మరియు 200 వరకు రేషన్ కార్డులో పేర్లను జత చెయ్యటం, నూతనంగా మంజూరు అయిన లబ్ధిదారులకు సోమవారం రోజున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంపిణీ చెయ్యటం జరిగింది. ఇట్టి సందర్భంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ, నూతనంగా రేషన్ మంజూరు అయిన కుటుంబాల వ్యక్తులు రేషన్ దుకాణాలకు వెళ్లి సన్న బియ్యాన్ని తీసుకవెళ్లవాల్సిందిగా తెలిపారు.ఇంకా మిగిలిన అర్హులైన వారు యుంటే గ్రామాల్లో ఉన్న మీ సేవలో అప్లై చేసుకోవాలని,కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఉచిత కరెంట్ 200 యూనిట్ల కోసం,సబ్సిడీ సిలిండర్ కోసం ఏర్గట్ల పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలో అప్లై చేసుకోవాలని శివన్నోళ్ళ శివకుమార్ అన్నారు. ఈ రేషన్ కార్డ్ తో వైద్యం కోసం 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ, అలాగే విద్యార్థులకు పై చదువు కోసం ఉపయోగపడుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా నయా పైసా ఖర్చు కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ కి జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ కు నూతనంగా మంజూరు అయిన రేషన్ కార్డుల లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమములో గడ్డం జీవన్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి,బద్దం లింగారెడ్డి,పన్నాల నర్సారెడ్డి, దండ బోయిన సాయి,పాకాల ప్రసాద్ గౌడ్,మేకల సాయన్న, కూరాకుల బోర్రన్న,సలీం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
