పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

0 14,588
  • టూటా అధ్యక్షులు డాక్టర్ ఎ.పున్నయ్య 

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  నూతన పెన్షన్ విధానం పేరుతో  అధ్యాపకుల, ఉపాధ్యాయ,ఉద్యోగుల జీవితాలను, జీతాలను షేర్ మార్కెట్లో తాకట్టు పెట్టిన  ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని  తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2003 ఆగస్టు 23న నూతన పెన్షన్ విధానాన్ని ప్రతిపాదించి   పార్లమెంట్ లో ఆమోదం తెలపకుండానే 2004 అక్టోబర్ 1 నుండి అమలులోకి తెచ్చిందన్నారు.  ఆయా రాష్ట్రాలు ఈ తీర్మానాన్ని  స్వచ్ఛందంగా ఎంచుకొనుటకు కేంద్రం అవకాశం ఇచ్చినప్పటికీ  చాలా రాష్ట్రాలు పోటీపడి  నూతన పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకోవడం  విచారకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి  వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్. టి. యాదగిరి రావు ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు.  ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ అడికే  నాగరాజు, ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి, డాక్టర్ పాత నాగరాజు, డాక్టర్ వాసం చంద్రశేఖర్,  డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ రాజేశ్వరి,డాక్టర్ బాలకిషన్,  డాక్టర్ శిరీష  బోయపాటి, డాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.