పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
టూటా అధ్యక్షులు డాక్టర్ ఎ.పున్నయ్య నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నూతన పెన్షన్ విధానం పేరుతో అధ్యాపకుల, ఉపాధ్యాయ,ఉద్యోగుల జీవితాలను, జీతాలను షేర్ మార్కెట్లో తాకట్టు పెట్టిన ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2003 ఆగస్టు 23న నూతన పెన్షన్ విధానాన్ని ప్రతిపాదించి పార్లమెంట్ లో ఆమోదం తెలపకుండానే 2004 అక్టోబర్ 1 నుండి అమలులోకి తెచ్చిందన్నారు....