- కలెక్టర్ ను కలిసిన దోంచంద గ్రామ రైతులు
బతుకమ్మ, ఏర్గట్ల : దోంచంద తీరా ప్రాంత రైతులకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి దిగువకు గోదావరి కి వచ్చిన వరదలతోని గోదావరి తీర ప్రాంతంలో ఉన్న మా పట్టా భూములలో వేసిన పంటలు గత 2019 నుండి 2025 సంవత్సరం వరకు పెట్టిన పంటలు గోదావరి వరదల వల్ల నష్టపోయి పంటలతో ఉన్న భూములు కోతకు గురి అవుతున్నాయి.దీనివల్ల మా గ్రామ రైతులకు చాలా నష్టం వాటిల్లుతున్నదని దోంచంద గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోదావరిలో వరదలు వచ్చిన ప్రతి సంవత్సరం ప్రభుత్వ అధికారులు రావడం కోతకు గురి అయిన భూములను పరిశీలించడం,పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసుకోవడం సర్వే చేయడం తప్ప 2019 నుండి 2025 వరకు మా గ్రామ రైతులకు ప్రభుత్వం తరఫున ఎటువంటి న్యాయం,నష్ట పరిహారం అందుకోలేమనీ, మా గ్రామ రైతుల పై దయచూపి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మా దోంచంద గ్రామ రైతుల ఆవేదన బాధను అర్థం చేసుకుని మాకు ప్రభుత్వ పరంగా శాశ్వత పరిష్కారం చూపగలరని జిల్లా కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో తాల్లారాంపూర్ సొసైటీ చైర్మన్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి,నాగిరెడ్డి రాజశేఖర్, కుర్మ రాజేందర్,ఎర్ర శశింధర్,ఇప్ప మల్లారెడ్డి,నాగిరెడ్డి చంద్రశేఖర్,నడిపొల్ల హనుమంత్ రెడ్డి,ఉన్నారు.
