24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్సారెస్పీ పై పర్యాటకుల సందడి

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అందాలను ఆస్వాదించడానికి అధిక సంఖ్యలో పర్యటకులు రావడంతో ప్రాజెక్టు పై పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆటవిడుపుగా ప్రాజెక్టు అందాలని తిలకించడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. ప్రాజెక్టు జల దృశ్యాలను, గోదావరి పరవాళ్ళు, ప్రాజెక్టు అందాలను తిలకిస్తూ చరవాణిలో సెల్ఫీలు దిగుతూ సంతోషంగా సేద తీరారు. స్థానిక నిజామాబాద్ జిల్లా ప్రజలే కాకుండా నిర్మల్, అదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి పర్యాటకులు తరలి వచ్చారు.

  • 38 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 3,70,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ 38 గేట్లు ఎత్తి 3,00,000 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల కొనసాగుతుంది. కాకతీయ ద్వారా 4500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 18,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టిఎంసిలు కాగా ఆదివారం సాయంత్రం 1087.90 అడుగులు, 69.57 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

Tourists flock to SSRSP

More articles

Latest article