ఎస్సారెస్పీ పై పర్యాటకుల సందడి

మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అందాలను ఆస్వాదించడానికి అధిక సంఖ్యలో పర్యటకులు రావడంతో ప్రాజెక్టు పై పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆటవిడుపుగా ప్రాజెక్టు అందాలని తిలకించడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. ప్రాజెక్టు జల దృశ్యాలను, గోదావరి పరవాళ్ళు, ప్రాజెక్టు అందాలను తిలకిస్తూ చరవాణిలో సెల్ఫీలు దిగుతూ సంతోషంగా సేద తీరారు. స్థానిక నిజామాబాద్ జిల్లా ప్రజలే కాకుండా నిర్మల్, అదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి పర్యాటకులు తరలి వచ్చారు. 38 గేట్ల ద్వారా...