25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తెల్ల రవన్న యువసేన ఆధ్వర్యంలో వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి :  కోటగిరి మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘంలో తెల్ల రవన్న యువసేన ఆధ్వర్యంలో మెగావైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బోధనకు చెందిన అమృత ట్రూ లైసెన్స్ ఆసుపత్రి వారి సహకారంతో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని కోటగిరి బిఆర్ఎస్  నాయకలు మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, తెల్ల రవి కుమార్ ప్రారంభించారు.ఈ మెగా వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, జనరల్ ఫిజీషియన్, కంటి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఎం వి ఎస్ సుధాకర్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ షేక్ షావలి, పీడియాట్రిక్ వైద్యులు డాక్టర్ విఘ్నేశ్వర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. లయన్స్ కమిటీ ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో సుమారు 300 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్ సమీర్ శ్యాంసుందర్ గౌడ్, శంకర్ గౌడ్, నజీర్, కప్ప సంతోష్, అరుణ్ గౌడ్, చిన్న అరవింద్, గౌతమ్, గంగా ప్రసాద్ గౌడ్, యోగేష్, మహేష్ రెడ్డి, రుద్రాంగి సందీప్, డాన్ రాజు, మేత్రి గంగాధర్, రహీం, గూడు దామరంచ, సంతోష్, వర్షిత్, బుట్టి సాయి తేజ, బర్ల అర్పిత్, వడ్ల ఉమాకాంత్, వల్లభాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, లైన్స్ క్లబ్ ప్రతినిధులు హనుమంతరావు పటేల్, పెద్ద కాపు శ్రీకాంత్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు సాయిలు, కాముట్ల సాయిలు, మస్కుల గంగారం, పుష్కల సాయిలు, మాస్కుల సాయిలు, దత్తు మల్కయ్య, ఉషం వడ్డెయ్య, శ్రీగంధం గంగారం,  శ్రీగంధం చిన్న గంగారం, కొప్పుల సాయిలు, కొప్పుల పోశెట్టి పాల్గొన్నారు.

Medical camp under the auspices of the White Ravanna Yuva Sena

More articles

Latest article