27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పంట నష్టం బాధితులకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సిపిఐ, సిపిఎంఎల్ నాయకుల డిమాండ్

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి  మండల కేంద్రంలోని సిర్నాపల్లి, నల్లవెల్లి,రాంసాగర్ తండ,గ్రామాల్లో నష్టపోయిన పంటలను  శనివారం సిపిఐ,సిపిఎంఎల్,రైతు సంఘాల  నాయకులు రైతులతో నష్టపోయిన పంటలను పరిశీలించారు.భారీ వర్షాలతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు  పైన ఉన్న చెరువులు   తెగిపోయి  లోతట్టు ప్రాంతంలోని  పంటలు తీవ్రంగా నష్టపోవడంతో     నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం,సంబంధిత  వ్యవసాయ శాఖ అధికారులు,రెవెన్యూ అధికారులు గ్రామాల్లో  పరిశీలించి  రైతులను ఆదుకోవడానికి  యుద్ధ ప్రాతిపదికన  చర్యలు  చేపట్టాలని డిమాండ్ చేశారు.రైతుల నోటికొచ్చిన పంట నష్టపోయినందున  ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారంతో పాటు పంట నష్టం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సిపిఎంఎల్  మాస్ లైన్, నాయకులు సాయ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు,వై రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి,అడ్డికే రాజేశ్వర్,ఉషన్,గ్రామ రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article