రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సార్వజని గణేష్ మండలి 75 వ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా గణనాథునికి బిజెపి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు యేండల లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి నిర్వాహకులు యేండల లక్ష్మీనారాయణకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, నాయకులు పార్వతి మురళి, సుధాకర్ గౌడ్, ఎముల గజేందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
