26.6 C
Hyderabad
Monday, August 3, 2026

లో లెవల్ బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తున్న వర్షపు నీరు

Must read

📰 Generate e-Paper Clip

  • రుద్రూర్ – బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేత

 

రుద్రూర్, బతుకమ్మ : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండుకుండల దర్శనమిస్తుంది.   వాగులు, అలుగులు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో లో లెవల్ బ్రిడ్జి పై నుండి నీరు పొంగిపొర్లుతున్నాయి. గురువారం లో లెవల్ బ్రిడ్జిని ఎస్సై సాయన్న పరిశీలించారు. వరద నీరు ఉదృతగా ప్రవహిస్తుండడంతో రుద్రూర్ – బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం గ్రామంలో పర్యటించి శితిలావస్థలో చేరిన ఇండ్లను, వర్షానికి ఊరుస్తున్న ఇండ్లను పరిశీలించారు. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Rainwater flowing over a low-level bridge

More articles

Latest article