లో లెవల్ బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తున్న వర్షపు నీరు
రుద్రూర్ - బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేత రుద్రూర్, బతుకమ్మ : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండుకుండల దర్శనమిస్తుంది. వాగులు, అలుగులు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో లో లెవల్ బ్రిడ్జి పై నుండి నీరు పొంగిపొర్లుతున్నాయి. గురువారం లో లెవల్ బ్రిడ్జిని ఎస్సై సాయన్న పరిశీలించారు. వరద నీరు ఉదృతగా ప్రవహిస్తుండడంతో రుద్రూర్ - బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం గ్రామంలో పర్యటించి శితిలావస్థలో...