కామారెడ్డి, బతుకమ్మ: భారీ వర్షాల ముంచెత్తడంతో కామారెడ్డి జిల్లాలోని విద్యా సంస్థలకు మరో రెండు రోజులు పాటు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వాతావరణ పరిస్థితులను గమనించి ఈ నెల 29 30 తేదీల్లో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
