30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

వరద ఉదృతికి కొట్టుకుపోయిన కోళ్ల ఫారం

Must read

📰 Generate e-Paper Clip

  • కొట్టుకుపోయిన 5000 కోడి పిల్లలు ,పౌల్ట్రీ ఫార్మ్ షెడ్, ఇల్లు
  • సుమారు రూ.25లక్షల భారీ నష్టం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫారం భారీ వరదకు కొట్టుకపోయింది. కోళ్ల ఫారం లో 21 రోజుల 5000 కోడి పిల్లలు ,పౌల్ట్రీ ఫార్మ్ షెడ్, ఇల్లు కొట్టుకుపోయాయి. సుమారు 25 లక్షల భారీ నష్టం జరిగినట్లు యజమాని పృథ్వీరాజ్ తెలిపారు. పౌల్ట్రీ ఫార్మ్ సమీపంలో ఉన్న ఒక గదిలో కాపలాదారులు వరదల్లో చిక్కుకోగా మంగళవారం ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, రెస్క్యూటివ్ సిబ్బంది సహాయంతో అక్కడ పనిచేస్తున్న కాపలాదారులను కాపాడి గట్టెక్కించారు. పౌల్ట్రీ ఫారం పూర్తి భారీ వరదకు కొట్టుకుపోవడంతో నేలమట్టమై ఆ రైతు తీవ్ర ఆందోళనలో దిగ్భ్రాంతి చెందుతున్నారు. అధికారులు తను కాపాడాలని వేడుకుంటున్నారు.

Chicken farm washed away by rising floodwaters

More articles

Latest article