39 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల
నిజామాబాద్/మెండోరా/ నిజాం సాగర్/ బతుకమ్మ:
గత రెండు రోజులుగా కురుస్తున్న వారి వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారి రవి తెలిపారు. దీంతో ఎస్సారెస్పీ 39 గేట్లు ఎత్తి 2,00,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ఎస్సారెస్పీ ప్రధాన కాలువైన కాకతీయ కాలువకు, స్థానిక నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో సాగునీరు తాగునీరు అందించే లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదలను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 2,76,567 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతోంది…
నిజాం సాగర్ 24 గేట్లు ఎత్తి మంజీరా లోకి నీటి విడుదల…
నిజాం సాగర్ కు దాదాపు రెండు లక్షల 45 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది.ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు నుంచి, మంజీరా నది తో పాటు కళ్యాణి , పోచారం ప్రాజెక్టు నిండడంతో భారీగా వరద వస్తుంది. ప్రాజెక్టు సామర్థ్యం 17.802 టీఎంసీలు గాను 16.357 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 2,45,165 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. 24 గేట్లు ఎత్తి 1,95,382 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.

… నిజాం సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. రెండు లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతుండటంతో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ బాన్సువాడ ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రకటన జారీ చేశారు పిట్లం మండలం కుర్తి గ్రామం, నిజాంసాగర్ మండలం లోని గోర్గల్, మాగి, మర్రిపల్లి, లింగంపల్లి గ్రామాలు, మహ్మద్‌నగర్ మండలం గున్కుల్, తుంకిపల్లి గ్రామాలు, బాన్సువాడ మండలం బుడిమి, బాన్సువాడ, నాగారం, దామరంచ, చించోలి, కిస్టాపూర్, బిర్కూర్, బారంగెడిగి గ్రామాలు ,నిజామాబాద్ జిల్లా లోని పోతంగల్ మండలం: కోడిచెర్ల, సుంకిని, కొల్లూరు, కల్లూరు, హెగ్డోలి, హంగర్గ గ్రామం సాలూరు మండలం మంజీరా నది తీర గ్రామం, బోధన్ మండలం నది తీర గ్రామాల ప్రజల భద్రత నిమిత్తం అన్ని జాగ్రత్త చర్యలు (అలర్ట్ / తరలింపు మొదలైనవి) చేసుకోవలసిందిగా కోరడమైనది తెలిపారు.
