ఎస్సారెస్పీ, నిజాం సాగర్ ల నుంచి లక్షల క్యూసెక్కులు నదిలోకి విడుధల
39 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల నిజామాబాద్/మెండోరా/ నిజాం సాగర్/ బతుకమ్మ: గత రెండు రోజులుగా కురుస్తున్న వారి వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారి రవి తెలిపారు. దీంతో ఎస్సారెస్పీ 39 గేట్లు ఎత్తి 2,00,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, 231 క్యూసెక్కుల...